Wednesday, January 22, 2025

పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా!

- Advertisement -
- Advertisement -
అదానీ దర్యాప్తు డిమాండ్‌పై ఏ మాత్రమూ తగ్గని ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో అదానీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాల్సిందేనన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రమూ తగ్గలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్స్ సంస్థ అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికలో అనేక ఆరోపణలున్నాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2 వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2.30 వరకు వాయిదాపడ్డాయి.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన రెండు రోజులకు, పార్లమెంటులోని బిజెపి ఎంపీలకు శుక్రవారం క్లుప్తీకరించారు. పార్లమెంటు సమావేశాలకు బిజెపి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని నియమంపెట్టారు. దాంతో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, కిరెణ్ రిజిజు, బిజెపి ఎంపీలు సుకాంత మజుందార్, సుశీల్ మోడీ ఈ రోజున ముందుగానే పార్లమెంటుకు చేరుకున్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కంపెనీలు ‘స్టాక్ మ్యానిపులేషన్, మోసాలకు దశాబ్దం నుంచి పాల్పడుతూ వచ్చింది’ అని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు అసలు పట్టించుకోవడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News