Wednesday, January 22, 2025

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఒక రోజు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఒక రోజు పొడిగించనున్నారు. సమావేశాలు శనివారం (10న) ముగుస్తాయి. 2014కు ముందు, ఆ తరువాత దేశ ఆర్థిక పరిస్థితిని పోలుస్తూ ‘శ్వేత పత్రం’ సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చేసిన ఒక ప్రకటన నేపథ్యంలో శ్వేత పత్రం సమర్పణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. లోక్ సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ శ్వేత పత్రం సమర్పణ జరగనున్నది.

ప్రతిపక్షాలను ఇరకాటంలోకి నెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శనివారం హాజరు కారాదని ప్రతిపక్ష నేతలు నిర్ణయించుకుంటే వారు సోమవారం రావలసి ఉంటుందని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో వారితో ప్రభుత్వం చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తరువాత శనివారం సమావేశం నిర్వహణకు నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. యుపిఎ హయాంలో ‘ఆర్థిక దుస్థితి, దాని దుష్పరిణామాల’ను శ్వేత పత్రం వివరించడంతో పాటు సకారాత్మక చర్యలు తీసుకుని ఉండవలసిన ఆవశ్యకతను ప్రధానంగా సూచిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News