Sunday, January 19, 2025

‘ఇవి చావో రేవో తేల్చే ఎన్నికలు’

- Advertisement -
- Advertisement -

ఇండియా భావం కొనసాగుదలను నిర్ణయిస్తాయి
కాంగ్రెస్ వెటరన్ ఎకె ఆంటోనీ
ఆరోగ్యం అనుమతిస్తే ప్రచారంలో పాల్గొంటా

తిరువనంతపురం : కాంగ్రెస్ వెటరన్ నేత ఎకె ఆంటోనీ రానున్న లోక్‌సభ ఎన్నికలను ‘చావో రేవో తేల్చే ఎన్నికలు’ అని మంగళవారం అభివర్ణించారు. ‘ఇండియా భావన కొనసాగుతుందా అని నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యం అనుమతించినట్లయితే యుడిఎఫ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. బిజెపి అభ్యర్థి అయిన తన కుమారునికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని కూడా ఆంటోనీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో యుడిఎఫ్ అభ్యర్థి తరఫున ప్రచారానికి పథనంతిట్టకు వెళతారా అని విలేకరులు అడిగినప్పుడు ‘నా ఆరోగ్య స్థితిపై అంతా ఆధారపడి ఉంటుంది’ అని ఆంటోనీ సమాధానం ఇచ్చారు.

ఆయన కుమారుడు అనిల్ కె ఆంటోనీని పథనంతిట్టలో బిజెపి తమ అభ్యర్థిగా నిలబెట్టినందున వెటరన్ ఆంటోనీని విలేకరులు ఆ ప్రశ్న వేశారు. పథనంతిట్టలో అనిల్ కె ఆంటోనీ సిట్టింగ్ యుడిఎఫ్ ఎంపి ఆంటో ఆంటోనీని, అధికార ఎల్‌డిఎఫ్ అభ్యర్థి, సీనియర్ సిపిఐ(ఎం) నేత, మాజీ మంత్రి టిఎం థామస ఐజాక్‌ను ఢీకొంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి నిర్మించిన వివాదాస్పద డాక్యుమెంటరీ చిత్రంపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ అనిల్ నిరుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అనిల్ తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని మోడీ క్రితం వారం పథనంతిట్టకు వచ్చారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, దీర్ఘ కాలం రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఎకె ఆంటోనీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా కేరళ రాజధానిలోని తన నివాసంలో గడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News