Monday, December 23, 2024

నేటి నుంచి పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి సెషన్ కాబోతున్నది. కేం ద్ర ఆ ర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. ఏ ప్రిల్,మే నెలల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగే అ వకాశం ఉంది.ఎన్నికలదరిమిలా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సెషన్‌కు ముందు మంగళవారం పార్లమెంట్‌లోని రాజకీయ పార్టీల సభా నేతల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌కు బడ్జెట్‌ను కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని తెలియజేశారు. ఫిబ్రవరి 9న ముగియనున్న 17వ లోక్‌సభ సమావేశాల ప్రధాన అజెండా రాష్ట్రపతి ప్రసంగం, మధ్యంతర బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, దానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం అని వివరించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో పలు అంశాలను ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు. బడ్జెట్ సెషన్‌లో నిరుద్యోగిత, అధిక ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, జాతుల మధ్య హింసాకాండ బాధిత మణిపూర్‌లో పరిస్థితి గురించి తమ పార్టీ ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ నేత కె సురేష్ తెలిపారు. వివిధ కేంద్ర పథకాల దృష్టా పశ్చిమ బెంగాల్‌కు రావలసిన బకాయిలను కూడా మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి చేర్చాలని తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ సూచించారు. ‘రాష్ట్రానికి కేంద్ర బకాయిలను సకాలంలో కేటాయించాలని కోరేందుకు ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చొనవలసి రావడం దురదృష్టకరం’ అని ఆయన అన్నారు.

1947 ఆగస్టు 15కు ముందు ఉన్న విధంగా మతపరమైన ప్రార్థనా స్థలాలను స్తంభింపచేసిన ప్రార్థన ప్రదేశాల చట్టం పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాది పార్టీ నేత ఎస్‌టి హాసన్ కోరారు. అఖిల పక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఈ సమావేశంలో చర్చలు ‘అత్యంత సౌహార్ద్రం’గా జరిగాయని, సంక్షిప్త సెషన్‌లో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. బడ్జెట్ సెషన్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద శాసనపరమైన అజెండా ఏదీ లేదని, రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాదాల తీర్మానంపై చర్చ, మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదన, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌పైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని జోషి తెలిపారు. ‘వారు సూచనలు చేశారు. అయితే, ఇది ప్రస్తుత లోక్‌సభ చివరి సెషన్ కనుక తదుపరి సెషన్‌లో వారికి అవకాశం ఇస్తామని మేము చెప్పాం’ అని మంత్రి తెలియజేశారు. పార్లమెంట్ భవనం సముదాయంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన వారిలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, జెడి (యు) నేత రామ్‌నాథ్ ఠాకూర్, టిడిపి నేత జయదేవ్ గల్లా కూడా ఉన్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గేకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారి మాట్లాడుతూ, అస్సాంలో రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రపై ‘దౌర్జన్యపూరిత దాడి’, యాత్రపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల అంశాన్ని తాను ప్రస్తావించినట్లు తెలియజేశారు. ‘దేశంలో ‘అలిఖిత నియంతృత్వం’ నెలకొందని తివారి విమర్శించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలను లక్షంగా చేసుకోవడానికి ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదించిన అనంతరం తాను ఈ అంశాలను ప్రస్తావించినట్లు తివారీ వెల్లడించారు. పార్లమెంట్‌లో తాము వివిధ అంశాలను ప్రస్తావించాలని వివిధ పార్టీల నేతలు భావిస్తుంటారు కనుక ప్రతి సెషన్‌కు ముందు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సంప్రదాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News