Monday, January 20, 2025

రిక్షా వాలా నుంచి ఇంజనీర్ వరకూ పార్లమెంట్ నిందితులలో బహుముఖాలు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌లో సంచలన సృష్టికర్తలైన అరడజన్ మందిలో అంతా విద్యాధికులు, పలు వృత్తులతో సంబంధం ఉన్నవారు ఉన్నట్లు గుర్తించారు. పలు సామాజిక వర్గాలతో వీరికి పరిచయం ఉంది. నిందితులు అంతా 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారే. వీరి పూర్వాపరాల గురించి ఇప్పుడు విచారణ బృందాలు రంగంలోకి దిగడంతో వివరాలు తేలుతున్నాయి.

ఆటోరిక్షా వాలా సాగర్ శర్మ
ఇప్పుడు పట్టుబడ్డ నిందితులలో ఒక్కరైన సాగర్ శర్మ 27 సంవత్సరాల యువకుడు. ఢిల్లీలో పుట్టిన సాగర్ ఎక్కువగా లక్నోలోనే గడిపాడు. ఎప్పుడూ భగత్‌సింగ్‌ను, మార్కిస్టు విప్లవవాది చేగువేరా గురించి సామాజిక మాధ్యమాలలో ప్రస్తావించారు. ఇక మనోరంజన్ డి మైసూరుకు చెందిన వాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడు. 34 సంవత్సరాల మనోరంజన్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడైంది. తన తండ్రి ద్వారా ఈ యువకుడు మైసూరు ఎంపి నుంచి విజిటర్స్ పాస్ పొందినట్లు నిర్థారణ అయింది. ఆయన తండ్రిపేరు దేవరాజే గౌడ్ . తన కుమారుడు ఈ విధంగా చేస్తాడని తాను అనుకోలేదని, తాను వాడిని క్షమించేది లేదన్నారు. పార్లమెంట్ మనది. ఈ ప్రజాస్వామిక దేవాలయాన్ని ఎందరో కలిసి నిర్మించారని , గాంధీ నెహ్రూ ఆదిగా నిరంతర ప్రక్రియగా ఉందని తెలిపారు. ఇందులో వెర్రివేషాలకు దిగిన తన కొడుకు వెధవ అన్నారు. మైసూరు ఎంపి నుంచే ఇద్దరికి పాస్‌లు అందినట్లు ఇప్పుడు నిర్థారణ అయింది.

నీలం జాద్ ఎంఫిల్ చదువు
హర్యానాలోని హిస్సార్‌కు చెందిన నీలం ఆజాద్ పార్లమెంట్ ఘటన దశలో వెలుపల ఉండి నినాదాలతో హంగామాకు దిగారు. ఆమె ఎంఫిల్ చేశారు, ఇటీవలే ఎన్‌ఇటి పరీక్షలో పాసయ్యారు. ఉపాధ్యాయ వృత్తికి సిద్దం అయ్యారు. 37 సంవత్సరాల నీలం పొగగొట్టాలను పార్లమెంట్‌లోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారని వెల్లడైంది. కేంద్రం నియంతృత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలకు దిగారు. ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళనల్లో కూడా నీలం పాల్గొన్నట్లు గుర్తించారు. పలు అర్హతలున్న నీలం ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగ సమస్యపై ప్రజలు, ఎంపిల దృష్టిని మళ్లించడానికి ఈ చర్యలో పాలుపంచుకున్నట్లు వెల్లడైంది. ఇక మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన అమోల్ షిండే పాతికేళ్ల వ్యక్తి, రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చాడు.

పోలీసు, ఆర్మీ నియామక ఉద్యోగాల పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. తనకు ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో వ్యవస్థపై విసుగు చెంది ఉన్నట్లు గుర్తించారు. తరచూ భగత్ సింగ్ గుర్తులు ఉన్న టీషర్టులతో కన్పించేవాడు. నిందితులందరిపైనా ఇప్పుడు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పరిధిలో కేసులు నమోదు అయ్యాయి. వీరిపై ఇప్పుడు కుట్ర, పలు వర్గాల నడుమ వైరం పెంచే చర్యల పరిధిలో ఐపిసి నిబంధనల కింద పలు సెక్షన్ల పరిధిలో కేసులు దాఖలు అయ్యాయి. ఇక ఘటన తరువాత భార్యతో పాటు గురుగావ్‌లో పట్టుబడ్డ విక్కీ శర్మ ఓ ఎక్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News