న్యూఢిల్లీ: వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత ప్రకారం జులైలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా గడచిన మూడు పార్లమెంట్ సమావేశాలు కుదించబడగా గత ఏడాది శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. గత ఏడాది జులైలో ప్రారంభం కావలసిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్‌లో మొదలయ్యాయి. కాగా, ఈ ఏడాది వర్షాకాల సమావేశాల నిర్వహణ తీరుతెన్నులపై చర్చలు జరుగుతున్నట్లు వర్గాలు తెలిపాయి. చాలామంది పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాల సిబ్బంది, ఇతర అధికారులకు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ కనీసం ఒక డోసు అయినా వేసుకున్న కారణంగా జులైలోనే వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.
Parliament Monsoon Session 2021 starts in July