Thursday, December 19, 2024

ఎపి, ఒడిశాలో ఎస్‌సి, ఎస్‌టి జాబితాల సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశారాష్ట్రాల్లో ఎస్‌సి, ఎస్‌టి జాబితాలను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను రాజ్యసభ మంగళవారం ఆమోదించగా, గురువారం లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. బిల్లులపై జరిగిన చర్చకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి భారతీ పి పవార్ సమాధానమిస్తూ గిరిజనుల సముద్ధరణ కోసం మోడీ ప్రభుత్వం ఎంతో చేసిందని చెప్పారు. అంతేకాకుండా అంతరించి పోయే ప్రమాదం ఉన్న గిరిజన గ్రూపుల సామాజికఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి

‘ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్’లాంటి పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఆంధ్రపదేశ్‌లో మరో మూడు గ్రూపులను బోండో పూర్జా, ఖోండ్ పూర్జా, పరంగిపెర్జా జాతులను ఎస్‌టి జాబితాలో చేర్చనుండగా, ఒడిశాలో కొత్తగా నాలుగు గ్రూపులను ఎస్‌టి జాబితాలో చేర్చనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు అంతరించే ప్రమాదం ఉన్న ఈ గ్రూపులను ఎస్‌టి జాబితాల చేర్చడం జరుగుతోందని ఆమె చెప్పారు. కాగా ఎస్‌టి జాబితాలో చేర్చాలని వివిధ వర్గాలనుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News