Monday, January 20, 2025

పైరసీకి చెక్‌గా సినిమాటోగ్రఫీ బిల్లు..ఉభయసభల ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆమోదం పొందిన సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లుతో సినిమా పరిశ్రమకు మేలు జరుగుతుందని కేంద్ర సమాచార , ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని వల్ల పైరసీ ఆటకట్టుకు వీలేర్పడుతుందన్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై మంత్రి సభలో స్పందించారు. పైరసీలతో చిత్ర పరిశ్రమకు ప్రతి ఏటా రూ 20వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని, పైరసీని నివారించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చామని వివరించారు. సినిమా పరిశ్రమ వారు తాము కష్టపడి సినిమాలు చేస్తే పైరసీతో గండిపడుతోందని చాలాకాలంగా ఆందోళన చెందుతున్నారని , వీరి వినతికి అనుగుణంగా ఈ బిల్లు తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు.

ఫిల్మ్‌పైరసీ ఓ క్యాన్సర్ అని, ఈ బిల్లుతో దీనిని నిర్మూలించవచ్చునని స్పష్టం చేశారు.సినిమా పైరసీకి పాల్పడినట్లు తేలితే, పైరెటెడ్ కాపీలు రూపొందించినట్లు నిర్థారణ అయితే ఇందుకు బాధ్యులకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. సంబంధిత సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్‌లో ఐదు శాతం వరకూ పైరసీదార్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లుతో రూపొందే సరికొత్త సినిమాటోగ్రాఫ్ చట్టంతో యుఎ కేటగిరి పరిధిలో వయస్సు ప్రాతిపదికన సర్టిఫికెట్లు జారీ చేస్తారు. దీని మేరకు యుఎ 7 +, యుఎ 13+,యుఎ 16+ వర్గీకరణలతో సర్టిఫికెట్లు వెలువడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News