జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలు మరింత సమర్థంగా వ్యవహరించేందుకు దోహదం చేసే విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు 2024ను పార్లమెంట్ మంగళవారం ఆమోదించింది. విపత్తుల సమయంల మెరుగైన రీతిలో వ్యవహరించడంలో రాష్ట్రాలకు ఈ శాసనం దోహదం చేస్తుందని కూడా ప్రభుత్వం ఉద్ఘాటించింది. 2005 నాటి విపత్తు నిర్వహణచట్టాన్ని సవరించే విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు 2024ను రాజ్యసభ మూజువాణి వోటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలను సభ తిరస్కరించింది.
2005 నాటి విపత్తు నిర్వహణ చట్టం అమలులో రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ప్రతిపాదిత సవరణలకు ప్రాతిపదిక రాష్ట్రాలు ప్రస్తావించిన ఇబ్బందులు, అవి చేసిన సూచనలు అని ప్రభుత్వం తెలిపింది. విపత్తు సమయాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వివిధ సంస్థల పాత్రలు, బాధ్యతలను బిల్లు నిర్దేశిస్తోంది. బిల్లుపై చర్చలో వయనాడ్‌లో విపత్తు సమయంలో ప్రభుత్వ స్పందనపై చెప్పుకోదగిన విధంగా దృష్టి కేంద్రీకరించడమైంది. కేంద్రం స్పందన తగిన విధంగా లేదని ప్రతిపక్ష సభ్యులు పలువురు ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తన సమాధానంలో తోసిపుచ్చారు.