Monday, January 20, 2025

పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ, బ్రిటీష్ కాలం నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఈ బిల్లుకు గత ఆగస్టు 3 ఆమోదం తెలిపింది. కాగా గురువారం బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం స్థానంలోఈ బిల్లును తీసుకువచ్చారు. పాత చట్టం కింద వార్తాపత్రికలు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎనిమిది అంచెలను దాటాల్సి ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త బిల్లు వల్ల ఇది సులభతరం కావడమే కాకుండా ఒక బటన్‌ను నొక్కడంతో పూర్తవుతుందని బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News