Sunday, January 19, 2025

మా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి: సోనియా

- Advertisement -
- Advertisement -

మా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి
వేచి చూడండి:  కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సూచించినవాటి కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటాయని తమ పార్టీ ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ సోమవారం చెప్పారు. మంగళవారం ప్రకటించనున్న ఫలితాల నుంచి మీ ఆశలు ఏమిటని ‘పిటిఐ’ ప్రశ్నించగా ‘మనం వేచి చూడవలసి ఉంటుంది’ అని సోనియా గాంధీ సమాధానం ఇచ్చారు. ‘ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్న వాటికి పూర్తి భిన్నంగా మా ఫలితాలు ఉంటాయని మేము ఎంతో ఆశతో ఉన్నాం’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని డిఎంకె కార్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన అనంతరం సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

డిఎంకె దిగ్గజం ఎం కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఆయనకు సోనియా నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవ సారి అధికారాన్ని నిలబెట్లుకుంటారని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించవచ్చునని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డిఎకు 400 పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పగా, అత్యధిక సంఖ్యాక ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డిఎ 350 సీట్లు గెలుచుకుంటుందని సూచించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థాయి 272 కన్నా అది బాగా ఎక్కువ. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చాయి. ఈ సర్వేలు ‘ఊహాత్మక’ కథనాలు అనిఅవి పేర్కొన్నాయి. ప్రతిపక్ష కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అవి స్పష్టం చేశాయి.

‘ఇది ఎగ్జిట్ పోల్ కాదు, కానీ దీని పేరు ‘మోడీ మీడియా పోల్’. ఇది మోడీజీ పోల్, ఇది ఆయన ఊహాజనిత పోల్’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి 295 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అంతకు ముందు కరుణానిధి 100 జయంత్యుత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘డాక్టర్ కలైంగర్ కరుణానిధి 100 జయంతి శుభ సందర్భంలో డిఎంకె సహచరులతో పాటు ఇక్కడ ఉండడం తనకుఆనందం కలిగిస్తోంది’ అని సోనియా గాంధీ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News