Wednesday, January 22, 2025

ఊపిరాడని ప్రజాస్వామ్యం!

- Advertisement -
- Advertisement -

అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్‌సైట్ ‘న్యూస్‌క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి వుంటుంది. పార్లమెంటు ఉభయ సభల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 141 మంది సభ్యులను డిసెంబర్ 18, 19 తేదీల్లో సస్పెండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాలక భారతీయ జనతా పార్టీని వీరు విమర్శించడం వల్లనే ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. వీరు ‘అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు’ సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెపుతోంది. బిజెపికి అనుబంధంగా లేని దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇంత మందిని పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం ‘ప్రజాస్వామ్య హత్య’ ని వారు అభివర్ణించారు. భారత దేశంలో బిజెపి ప్రభుత్వం ‘తీవ్ర నియంతృత్వాన్ని’ అమలు చేస్తోందని వారు ఆరోపించారు.

మా అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ స్తంభింప చేయడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని భారతీయ వార్తా వెబ్‌సైట్ ‘న్యూస్‌క్లిక్’ ప్రకటించింది. ఎందుకంటే ఈ వార్తా వెబ్‌సైట్‌ను నిశ్శబ్దంగా మూసివేసేటట్టు చేయాలనే ఇలా చేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ వెబ్‌సైట్‌ను ‘చట్టం పరిధిలో పాలనాపరంగా మూసివేయడానికి’ 2021 ఫిబ్రవరి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేత దాడి చేయించింది. ఆదాయ పన్ను శాఖ 2021 సెప్టెంబర్‌లో చేసిన పరిశీలననుసరించి ఆ మరుసటి నెల అక్టోబర్ 3 వ తేదీన పెద్ద ఎత్తున దాడి చేసిందని ‘న్యూస్‌క్లిక్’ ఎడిటర్లు ప్రకటించారు. ఫలితంగా ‘న్యూస్‌క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్త, దాని పరిపాలనాధికారి చక్రవర్తిని అరెస్టు చేయడంతో వారిప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు.

భారత ప్రజాస్వామ్య శాఖలు
‘భారత ప్రజాస్వామ్య శాఖలు క్షీణిస్తున్నాయి’ అని ‘ద ఎకనమిస్ట్’ పత్రిక 2022 ఫిబ్రవరిలో గుర్తించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ రెండేళ్ళ తరువాత ఇలా అన్నారు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా పాలించడమే ప్రజాస్వామ్యం. ప్రస్తుత పరిస్థితిలో నిర్భయంగా చర్చించినట్టయితే ప్రజాస్వామ్యాన్ని పొందలేకపోతున్నాం. ఓట్లను ఎలా లెక్కిస్తావో అదే ముఖ్యమవుతోంది. అదే ఇప్పుడు పెద్ద సత్యమవుతోంది. ఈ పరిస్థితిని చూసి ప్రజలిప్పుడు భయపడిపోతున్నారు. గతంలో నేనెప్పుడూ ఈ పరిస్థితిని చూడలేదు” అని భారత దేశంలో అత్యంత గౌరవప్రదమైన జర్నలిస్టు, ‘ద హిందూ’ మాజీ ఎడిటర్ ఎన్. రావ్‌ు అంటారు. భారత ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని, ‘న్యూస్‌క్లిక్’ పైన దాడి నేపథ్యంలో చర్చించాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడిందని 2023 ఆగస్టులో ‘ద ప్రాస్‌పెక్ట్’ లో ఎన్.రావ్‌ు రాశారు. ఈ దాడి ‘నా దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత తక్కువగా ఉందో, దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ‘నవ భారతం’లో దాన్ని అవిచ్ఛిన్నంగా ఎంత తగ్గించేస్తున్నారో!

‘న్యూస్‌క్లిక్’ కు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగాం తప్పుడు సమాచారంతో దూషణలకు దిగి భయపడేలా చేస్తోంది’ అని ఆయన రాశారు. ప్రపంచం దీన్ని భయంతో వీక్షించాలి’ అని పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ, రిపోర్టర్స్ విథౌట్ బార్డర్స్ వంటి పది సంస్థలు ‘ఆన్‌లైన్ విమర్శకులను, పాత్రికేయులను వేధించడం మానుకోవాలి’ అని 2022 మే లో ఒక ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించినప్పుడు తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, దేశద్రోహ నేరం కేసు చట్టాలను జర్నలిస్టులపైన ఎలా ఉపయోగిస్తోందో ఆ ప్రకటనలో పేర్కొంది. పెగాసెస్ స్పైవేర్ వంటి గూఢచర్య సాంకేతికతను ఉపయోగించి జర్నలిస్టుల ప్రైవేటు సంభాషణకు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. జర్నలిస్టులపైన భౌతిక దాడులు చేసి భయపెడుతున్నారు.

ముఖ్యంగా ముస్లిం జర్నలిస్టులపైన, జమ్మూకశ్మీర్ గురించిన వార్తలు రాసే జర్నలిస్టుల పైన, 2021 22 మధ్య జరిగిన రైతు ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులపైన ఈ దాడులు జరుగుతున్నాయి. ‘న్యూస్‌క్లిక్’ పైన ప్రభుత్వం దాడి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి పత్రికలపైన దాడిని మరింత విస్తృతం చేశారు. ప్రబీర్ పురకాయస్త, చక్రవర్తిలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు స్పందించినందుకు జర్నలిస్టు సంఘాలపైన పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల పట్ల ద ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర విచారాన్ని వ్యక్తంచేసింది. ‘నిరంకుశ చట్టాల నీడలో ప్రభుత్వం భయపెట్టే వాతావరణాన్ని కల్పించకూడదు’ అని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది.

న్యూయార్క్ టైవ్‌‌సు పాత్ర
“మోడీ నాయకత్వంలో భారత పత్రికా రంగం ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేదు” అన్న శీర్షికతో న్యూయార్క్ టైవ్‌‌సు ఒక కథనాన్ని రాసింది. మార్చి 2020లో ప్రధాన పత్రికల యజమానులతో సమావేశమైన మోడీ “స్పందింపచేసే అనుకూలమైన కథనాలను” మాత్రమే ప్రచురించాలని కోరారు. కోవిడ్ 19 విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను భారత పత్రికలు రాస్తే, మోడీ సుప్రీం కోర్టుకు వెళ్ళి ‘ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని’ తప్పనిసరిగా రాయాలని వాదించింది. ప్రభుత్వ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం ప్రభుత్వ అభిప్రాయంతో పాటు తమ వ్యాఖ్యానాలను కూడా రాయవచ్చని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాలు దురదృష్టకరమని, పత్రికల్లో ముందస్తు సెన్సార్ షిప్‌కు అనుమతినివ్వడమేనని ‘ద వైర్’ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ అన్నారు. ‘న్యూస్‌క్లిక్’ను చట్టపరంగా మూసేయాలని భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిన కొన్ని నెలల తరువాత కోవిడ్ 19 విపత్తు గురించి, రైతుల ఆందోళన గురించి, రాజ్యాంగం గురించి రిపోర్టర్లు స్వేచ్ఛగా రాసే అవకాశాన్ని ‘న్యూస్‌క్లిక్’ కల్పించింది.

‘న్యూస్‌క్లిక్’పైన జరిపిన వరుస గాలింపు చర్యల్లో ఎలాంటి చట్టవ్యతిరేకమైనవీ కనుగొనలేకపోయారు. విదేశాల నుంచి నిధులు వచ్చినట్టు అస్పష్టమైన సూచనలు చేసినప్పటికీ, భారతీయ చట్టాలననుసరించే ‘న్యూస్‌క్లిక్’కు నిధుల సేకరణ జరుగుతోందని యాజమాన్యం స్పష్టం చేసింది. ‘న్యూస్‌క్లిక్’పై కేసు చల్లబడుతున్నప్పుడు, 2023 ఆగస్టులో ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ పత్రిక ‘న్యూస్‌క్లిక్’కు వస్తున్న నిధుల గురించి వ్యతిరేకంగా అవమానపరిచేలా, ఊహాగానాలతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ మరుసటి రోజే ఈ కథనాన్ని ‘నేరానికి సాక్ష్యం’ గా చూపిస్తూ భారత ప్రభుత్వం ‘న్యూస్‌క్లిక్’పైన దాడుల పరంపర కొనసాగించింది. పత్రికా స్వేచ్ఛను భారత ప్రభుత్వం అణచివేస్తోందని ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ గతంలో హెచ్చరించిన విషయం మనం మరువకూడదు. ‘న్యూస్‌క్లిక్’ను భారత ప్రభుత్వం మూసివేసే చర్యలు చేపట్టడానికి ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ రాసిన ఈ కథనం అవకాశాన్ని కల్పించింది. దాని ఫలితంగానే ఆదాయపు పన్ను శాఖ ద్వారా వీరిప్పుడు దాడులు చేస్తున్నారు.

డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటులో ఆగంతకులు చొరబడిన సంఘటన నేపథ్యంలో రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా వుండాలని కోరిన 141 మంది పార్లమెంటు సభ్యులను నిందితులుగా మార్చేశారు. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం అరికట్టలేకపోవడానికి, మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణను నివారించలేకపోవడానికి నిరసనగా ప్రెస్ గ్యాలరీ నుంచి ఇద్దరు పార్లమెంటులోకి దూకి పొగ క్యాండిళ్ళను విసిరేశారు. బిజెపి పార్లమెంటు సభ్యుడు ప్రతాప్ సింహ ద్వారా పొందిన పాసులతోనే వారు పార్లమెంటులోకి ప్రవేశించారు. అలాంటి వారికి పాసులిచ్చిన పార్లమెంటు సభ్యుడిని మాత్రం సస్పెండ్ చేయలేదు. ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడానికి బిజెపి ఈ సంఘటనను ఉపయోగించుకుందే తప్ప ఈ సంఘటనను మాత్రం ఖండించలేదు. పొగ బాంబులు విసిరిన ఇద్దరూ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు సరికదా, ప్రతిపక్ష పార్టీతో ఎలాంటి సంబంధం ఉన్నవారు కూడా కాదు.

ఒక అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న మనోజ్. డి తన కుటుంబాన్ని చూసుకోవడం కోసం విదేశాల నుంచి తిరిగి వచ్చేశాడు. ఆర్థిక కారణాల వల్ల స్కూల్లోనే చదువు మానేసిన సాగర్ శర్మ టాక్సీ నడుపుతున్నాడు. నీలం ఆజాద్ ఎం.ఎ. ఎం.ఇడి చదివి ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. మోడీ భారత దేశంలో యువతీ యువకులు నిరాశలో వున్నారు. వారికెటువంటి రాజకీయ సంబంధాలు లేవు. తమ బాధను సహజమైన ప్రజాస్వామిక పద్ధతిలో వ్యక్తీకరించాలని ప్రయత్నించినా వీలు కాలేదు. సమాజ సంక్షోభంలో భాగం వారు నిరాశతోనే ఈ సాహసానికి ఒడిగట్టారు. ‘న్యూస్‌క్లిక్’ పైన ప్రభుత్వ దాడి కానీ, పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ కానీ ఆ సంక్షోభంలో భాగంగానే చూడాలి. ఈ పరిణామాల ఫలితంగా భారత దేశంలో ప్రజాస్వామ్యానికి ఉక్కపోతతో ఊపిరాడడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News