Friday, November 15, 2024

31 నుంచి పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫి బ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ న ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఇందులో కొన్ని కీలక ఆర్థిక ప్రకటనలు చే సే అవకాశం ఉంది. మహిళా రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్తను ప్రకటించే అ వకాశం ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ స మ్మాన్ నిధి పథకం కింద మహిళా రైతుల కు పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది. సొంత భూమి ఉన్న మహి ళా రైతులకు సంవత్సరానికి రూ. 6వేలు ఉన్న పెట్టుబడి సాయన్ని రూ. 12వేలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఇందుకు సంబంధింఒచిన ప్రకటన చేసే అవకాశం ఉందని వర్గా లు తెలిపాయి. ప్రస్తుతం సంవత్సరానికి రూ.6వేలు అందచేస్తున్న పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయడం వల్ల ప్రభుత్వం పై అదనంగా రూ. 12 వేల కోట్ల భారం పడుతుందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకటించే ఈ సాయం పెంపుదల రానున్న లోక్‌సభ ఎన్నికలు ముందుగా మహిళా వ్యవసాయ కార్మికులకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి మరో ముందడుగు కాగలదని వర్గాలు అభిప్రాయపడ్డాయి.

2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారగలదని ఆశిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి మరి న్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయా న్ని పెంచే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయం పన్ను చట్ట నిబంధనలలో పెద్దగా మార్పులేవీ ఉండే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయితే ఉత్పత్తికి ముడిపడిన రాయితీ పథకానికి ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహం లభించవచ్చు. భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News