మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాణిని మరింత బలంగా వినిపించాలని టిఆర్‌ఎస్ ఎంపిలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోగానీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాన్ని వదిలిపెట్టవద్దన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే ఏ చిన్న విషయంలోనూ వెనక్కు తగ్గవద్దని సూచించారు. ఇప్పటికే కేంద్రంపై టిఆర్‌ఎస్ పక్షాన పోరాటం మొదలుపెట్టామన్నారు. త్వరలోనే జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను మనకు అనుకూలం గా మార్చుకుని మోడీ సర్కార్‌పై అంశాల వారిగా రణభేరి మ్రోగించాలన్నారు.ఈ నెల 7న పార్లమెంట్ సమావేశా లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూ హంపై సోమవారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎంపిలతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఎన్ని బిల్లులను ప్రవేశపెడుతోంది, అందులో రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజ నం కలుగుతుంది? ఏ బిల్లలపై కేంద్రాన్ని ఎండగట్టాలి? తదితర అంశాలపై ఎంపీలోతో కెసిఆర్ చర్పించారు. ఈ సమావేశాల్లో కేంద్రం మొత్తంగా 16 బిల్లలను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రతి బిల్లుకు సంబంధించిన అంశంపై లోతుగా అధ్యయనం చేసి సభకు వెళ్లాలని కెసిఆర్ సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులుగానీ, విభజన చట్టం హామీలుగానీ ఏ ఒక్కటీ నెరవేరడం లేదని…దీనిని వ్యతిరేకిస్తూ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందన్న అం శంపై కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే స మావేశాలను బహిష్కరించి కేంద్రంపై పోరాటం చేయడం కంటే సభలోనే ఉండి మోడీ సర్కార్‌ను నిలదీస్తేనే సబబుగా ఉంటుందని పలువురు ఎంపిలు అభిప్రాయపడినట్లుగా స మాచారం. సిఎం కెసిఆర్ కూడా దీనికే మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది. అలాగే సభలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పాల్పడుతున్న కక్ష సాధింపు చర్యలను ఎండగట్టడం వల్ల ఇతర పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంటుందని సిఎం వ్యాఖ్యానించారు. ఇలా బిజెపియేతర పార్టీల మద్దతు తీసుకుని
మోడీ సర్కాను పార్లమెంట్ ఉభయ సభల్లో నిలదీయడం వల్ల….కేంద్ర చర్యలను దేశ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకునే అవకాశముంటుందని కెసిఆర్ సూచించారు.ప్రస్తుతం రా ష్ట్రంలో జరుగుతున్న సిబిఐ, ఐటి, ఇడి దాడులకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తాలని, ఈ అంశాలపై సమగ్ర చర్చ జరిగే విధంగా ఎంపిలు కృషి చేయాలని సూచించారు. ఇందుకు కేంద్రం ఒప్పుకోని పక్షంలో తదనుగుణంగా నిర్ణ యం తీసుకుందామన్నారు. పార్టీ పక్షాన లేవనెత్తే అం శాలకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రానిపక్షంలో అ వసరమైతే పార్లమెంట్ ప్రాంగణంలో నిరనన కార్యక్రమాలు చేపట్టాలని కెసిఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది.