Monday, December 23, 2024

శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మోడీ మీడియాతో ప్రసంగించారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీ శక్తిని ప్రదర్శించారని, నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని మోడీ కొనియాడారు. కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే చేపట్టనున్నారు. గురువారం తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. గత సమావేశాల్లో ఘటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు పరిసరాల్లో సిఐఎస్‌ఎఫ్ బలగాలు మోహరించడంతో పాటు తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News