- Advertisement -
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఉభయ సభ సభ్యులను ఉద్దేశించి అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారంనాడు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు మొత్తం 26 రోజుల పాటు రెండు విడతల్లో జరుగుతాయి. మొదటి విడత ఫిబ్రవరి 14న ముగియనుంది. తిరిగి మార్చి 12న రెండో విడత సమావేశాలు మొదలవుతాయి. ఏప్రిల్ 6వరకు బడ్జెట్‌పై చర్చ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీరానాలు ఉంటాయని జోషి వివరించారు.
- Advertisement -