హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలో మారనున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా పిఎం మోడీ లోక్ సభలో కీలక ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత భవనంలోని పలు జ్ఞాపాకాలను పిఎం మోడీ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు పాత భవనంలోనే జరినట్లు, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్ లా ఎపి, తెలంగాణ విభజన జరగలేదు. వాజ్ పేయీ హయాంలోమూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఆర్టికల్ 370, జిఎస్ టి, ఒకే దేశం, ఒకే పించను వంటి కీలక బిల్లులను మోడీ ప్రస్తావించారు.పార్లమెంట్ లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ ప్రసంగం ఇప్పికీ ప్రజాప్రతినిధులకు ఎంతగానో స్పూర్తినిస్తుందన్నారు .ప్రపంచంలో బలమైన దేశంగా భారత్ గెలిచింది. ఈ 75 ఏళ్ల లో 7500 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారు.17 మంది స్పీకర్లు పని చేశారన్నారు.
భిన్నత్వానికి ప్రతీకైన ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఈ భవనం భాగస్వామ్యం కల్పించిందని, దళితులు, ఆది వాసీలు, మధ్య తరగతి ప్రజలు, మహిళలకు ఈ సభ అవకాశం కల్పిందన్నారు. పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడి.. ఈ భవనంపై జరిగింది కాదని.. భారతీయ జీవాత్మపై జరిగిన దాడి అని అన్నారు. సభ్యులను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల సాహపం జాతి ఉన్నంతకాలం గుర్తుంటుందన్నారు. చంద్రయాన్-3 విజయం భారత సాంకేతిక , విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. జీ 20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో .. ఒక వర్గానిదో.. వ్యక్తిదో కాదు.. యావత్ 140 కోట్ల భారతీయులదని పిఎం మోడీ పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ ఉభసభల్లో బిఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.ఎంపీ నామా నాగేశ్వరరావు, కే కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉభయసభల్లో రిజర్వేన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.