Thursday, January 23, 2025

ఆగస్టు 8—10న అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఆగస్టు 8-,9, 10 తేదీలలో చర్చించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టింది. ్లలోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్‌కు నోటీసు అందచేశారు. 2018 తర్వాత పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాన్ని ప్రధాని మోడీ ఎదుర్కోవడం ఇది రెండవసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News