Monday, November 18, 2024

29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాలం సమావేశాలు

- Advertisement -
- Advertisement -
Parliament
కోవిడ్ ప్రోటోకాల్ అనుసరించాల్సి ఉంటుంది!

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని పార్లమెంటు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సోమవారం సిఫార్సు చేసింది. గత పార్లమెంటు సమావేశాలలో మాదిరిగానే ఈసారి కూడా కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించనుంది. గత ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా శీతాకాలం సమావేశాలు జరగలేదు. గత బడ్జెట్, మాన్సూన్ సమావేశాలు కుదింపునకు గురయ్యాయి.ఈసారి శీతాకాలం సమావేశాలలో దాదాపు 20 సిట్టింగ్స్ ఉండనున్నాయి. ద్రవ్యోల్బణం, కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడులు,లఖీంపుర్ ఖేరి హింసాకాండ, రైతుల ఆందోళన వంటి విషయాలపై ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభ ఒకే దఫాలో(సైమల్టేనియస్‌గా) జరుగుతాయి. పార్లమెంటు సభ్యులు సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించాల్సి ఉంటుంది. సమావేశం ఆరంభం కాక ముందే మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం పార్ల మెంటు శీతాకాలం సమావేశాల తేదీని నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు సిఫార్సు చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News