- Advertisement -
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. 12 మంది ఎంపిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయమని స్పష్టం చేశారు. దీంతో నిరసనగా విపక్ష ఎంపిలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అటు లోక్ సభలోనూ ఎంపిలు ఆందోళనలు విరమించకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్ ఎంపిలు కూడా విపక్షాలతో కలిసి ఆందోళన చేస్తున్నారు.
- Advertisement -