Friday, December 20, 2024

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 డిసెంబర్ 7న ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయి. 23 రోజులపాటు 17 సమావేశాలు జరగనున్నాయి.”పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2022 డిసెంబర్ 7 నుండి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు 23 రోజుల పాటు 17 సమావేశాలు జరుగుతాయి. సెషన్‌లో శాసనసభ వ్యవహారాలు , ఇతర అంశాలపై చర్చల కోసం,  నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నాను” అని మంత్రి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు.

శీతాకాలపు సెషన్ సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంది, కానీ ఈసారి అది డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. పాత భవనంలో సభ జరిగే అవకాశం ఉండగా, ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ ప్రారంభంలో రూ. 1,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అభిజ్ఞ వర్గాల ప్రకారం, 2023 మొదటి పార్లమెంట్ సమావేశాలు, అంటే బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించబడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News