Thursday, January 23, 2025

డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభమయి క్రిస్మస్‌కు ముందు ముగిసే అవకాశముందని అధికార వర్గాలు తెలియజేశాయి. డిసెంబర్ 3న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ముగిసిన కొద్ది రోజలు తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆ వర్గాలు తెలిపాయి. ఐపిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రవేశపెట్టబోయే మూడు కీలక బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హోం వ్యవహారాల పార్లమెంటు స్థాయీ సంఘం ఈ బిల్లులకు సంబంధించిన నివేదికలను ఇప్పటికేఆమోదించింది. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమయి క్రిస్మస్‌కు ముందు ముగుస్తూ ఉంటాయి.

ఎన్నికల ప్రధానాధికారి(సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు కూడా పార్లమెంటు ముందు పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి యత్నించలేదు. సిఇసి, ఇసిల హోదాను కేబినెట్ సెక్రటరీలతో సమానం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుండడంపై ప్రతిపక్షాలతో పాటుగా మాజీ ఎన్నికల ప్రధానాధికారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి కారణం. ప్రస్తుతం వీరికి సుప్రీంకోర్టు జడితో సమానమైన హోదా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News