- Advertisement -
3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 మంది ఓటర్లు ఉన్నట్లు ఇసి వెల్లడించింది. ఇందులో పురుష ఓటర్లు 1,64,47,132 మంది.. మహిళ ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నట్లు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉన్నారని ముసాయిదా జాబితాలో పేర్కొంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఈవో వికాస్ రాజ్ సూచించారు.
- Advertisement -