Monday, December 23, 2024

యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని పార్లమెంటరీ కమిటీ యోచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల దాడి వివాదంపై యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాజలీకి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యోచిస్తున్నట్లు కమిటీ సెక్రటేరియట్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.

త్వరలో జరగనున్న కమిటీ సమావేశానికి యాపిల్ సంస్థ ప్రతినిధులను పిలిపించాలని కమిటీ యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిటీ సెక్రటేరియట్ ఈ వ్యవహారాన్ని చాలా గంభీరంగా పరిగణిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

తమ ఫోన్ల హ్యాకింగ్ జరిగినటు్ల యాపిల్ నుంచి తమకు అలర్ట్ మెసేజెస్ వచ్చాయంటూ ప్రతిపఓ నాయకులు మహువా మొయిత్ర, ప్రియాంక చతుర్వేది, శశి థరూర్, పవన్ ఖేరాతోపాటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News