Thursday, December 26, 2024

రాజ్‌కోట్ విమానాశ్రయ టెర్మినల్‌లో కూలిన పందిరి

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విమానాశ్రయం టెర్మినల్ వెలుపల ఒక పందిరి భారీ వర్షం ధాటికి శనివారం కూలిపోయింది. ఎవరికైనా గాయాలు తగిలాయా అన్న సమాచారం లేదు. విమానాశ్రయం అధికారులు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో కనిపించింది. టెర్మినల్ వెలుపల ప్రయాణికుల రాకపోకల ప్రదేశం వద్ద ఈ సంఘటన సంభవించింది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 పైకప్పు కూలిన దుర్ఘటన మరునాడు ఈ సంఘటన చోటు చేసుకున్నది. ఢిల్లీ డుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరి కొందరు గాయపడిన విషయం విదితమే.

నెహ్రూను నిందించరాదు : బిజెపి
ఇది ఇలా ఉండగా, రాజ్‌కోట్ విమానాశ్రయం వెలుపల ఘటనపై ఢిల్లీలో బిజెపి స్పందిస్తూ, ఈ సంఘటనకు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిందించరాదని, ఎందుకంటే ‘అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను ఆయన నిర్మించలేదు’ అని వ్యాఖ్యానించింది. ‘ఆయనకే వదలివేస్తే మనం అంతా డిఆర్‌డిఒ నిర్ధారించిన ఎడ్ల బళ్లలో ప్రయాణిస్తుండేవారం’ అని బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ అన్నారు. మాల్వీయ తన అధికార ‘ఎక్స్’ మాధ్యమంలో కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘భారీ గాలులు, వర్షం కారణంగా రాజ్‌కోట్ విమానాశ్రయం గుడారం చినిగిపోవడం మౌలిక వసతి కూలిపోవడం వంటిది కాదు. పౌర విమానయాన మంత్రిత్వశాఖ దేశంలోని అన్ని చిన్న, పెద్ద విమానాశ్రయాల భద్రత సమీక్షకు ఆదేశించింది’ అని తెలిపారు. గుడారం కూలిన ప్రాంతంలో ప్రస్తుతం మరమ్మతు పని సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News