Saturday, November 16, 2024

పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్థులు నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని నిండాముంచుతున్నారు. కొందరు నేరస్థులు, వారికి ఇంట్లో కూర్చొని ఉద్యోగం చెయవచ్చని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా ఈ ముఠా నేరాలు చేస్తోంది. దీనిపై ఇడి అధికారులు కొరడా జులిపించారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లోని రూ.32కోట్లకు పైగా ఉన్న నగదును ఫ్రీజ్ చేశారు. ఇండియాలోని నిరుద్యోగులను టార్గెట్ చేసిన నేరస్థులు దుబాయ్ కేంద్రంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వాట్సాప్, టెలీగ్రాం ద్వారా నిరుద్యోగులను కాంటాక్ట్ చేస్తున్నారు. వారికి ఆశ చూపించి తమ వద్ద పార్ట్‌టైం జాబులు ఉన్నాయని చెప్పి నమ్మిస్తున్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తే భారీగా జీతాలు ఇస్తామని చెబుతున్నారు. దీనికి అంగీకరించిన వారికి తర్వాత వివిధ రకాల ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ ముఠా దేశంలో 15 రోజుల్లో 524 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. హోటల్స్, టూరిస్ట్ వెబ్‌సైట్లు, రిసార్టులు వంటి
వాటికి రేటింగ్ ఇస్తే ఆదాయం వస్తుందని నమ్మించారు. బోగస్ మొబైల్ అప్లికేషన్లు సృష్టించి పెట్టుబడులు
పెట్టించారు. యూఏఈలో ఉన్న నేరగాళ్లు ఇదంతా చేయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. భారత్‌లో బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలోకి సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఆ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఇప్పటి వరకు 175 ఖాతాల ద్వారా రూ.524 కోట్లు కాజేసినట్టు ఈడీ గుర్తించింది. వీటిని మరో 480 ఖాతాలకు డబ్బులను మళ్లించి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఇడి అధికారులు దేశవ్యాప్తంగా 50 కేసులు నమోదు చేశారు.హైదరాబాద్‌లో కూడా ఇలాంటి మోసం జరగడంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News