Saturday, November 23, 2024

నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు: విచారణలో అర్పిత వెల్లడి!

- Advertisement -
- Advertisement -

Partha Chatterjee use my house as mini Bank: Arpitha

నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు
ఎంత డబ్బుందో ఏనాడూ చెప్పలేదు
విచారణలో అర్పిత వెల్లడి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ సహా పలువురిని ఇడి అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి తన ఇంటిని ఒక మినీ బ్యాంకులా వాడుకున్నారని, డబ్బును తన ఇంట్లోనే దాచేవారని అర్పిత వెల్లడించినట్లు సమాచారం. ‘నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకే మాత్రమే ప్రవేశం వుంది. ప్రతి వారం పది రోజులకొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు వుంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు’ అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే బెంగాలీ నటుడి ద్వారా మంత్రితో తనకు పరిచయం ఏర్పడినట్లు చెప్పారన్నాయి. బదిలీలు, కళాశాలల గుర్తింపునకు సహకరించినందుకు ప్రతిఫలంగా ఈ డబ్బు అందేదని వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఈ నేరారోపణలకు సంబంధించిన పత్రాలను ఇడి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒ డైరీని స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో కీలక సమాచారం లభించొచ్చని అంచనా వేస్తున్నారు. పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా కొనసాగిన 20142021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి శుక్రవారం జరిపిన సోదాల్లో అర్పితా ముఖర్జీ నివాసంలో లభించిన నగదు రూ.21 కోట్లుగా ఇడి వెల్లడించింది. ఆమె తన వద్ద అంత డబ్బు ఎందుకు వుందో సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. కుంభకోణంతో ప్రమేయం వుండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది.

Partha Chatterjee use my house as mini Bank: Arpitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News