హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే విధానాన్ని పరిశీలించడానికి ప్రత్యేక పరిశీలకులుగా వెళ్లారు. ఈక్రమంలో ఇఎస్సి పార్థసారధితో పాటు ఎన్నికల పరిశీలకులుగా నియమింపబడిన హర్యానా, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ మరియు గోవా రాష్ట్రాల ఎన్నికల కమీషనర్లు శుక్రవారం నాడు చండీగఢ్ లో సమావేశమై, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి చండీగఢ్ ఎన్నికల కమీషన్ తీసుకున్న పలు చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని డిస్ట్రిబ్యూషన్,రిసిప్షన్ , కౌంటింగ్ కేంద్రాలను కూడా సందర్శించి అక్కడి ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సెక్యూరిటీ స్థాయి వివరాలను సంబంధిత జిల్లా అధికారుల నుండి తెలుసుకొన్నారు.
చండీగఢ్ ‘మున్సిపల్’ ఎన్నికల పరిశీలకునిగా ఎస్ఇసి పార్థసారధి
- Advertisement -
- Advertisement -
- Advertisement -