Sunday, January 19, 2025

నేడు చంద్రగ్రహణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహు గ్రస్తఖండగ్రాససోమోపరాగము అనగా పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 ని.ల వరకు ఉంటుంది.

– స్పర్శకాలం (పట్టు)    రాత్రిగం 01 : 05 ని//లు

– మధ్యకాలం(మధ్య)    రాత్రిగం 01 : 44 ని//లు

– మోక్షకాలం  (విడుపు)  రాత్రిగం 02 : 22 ని//లు

– గ్రహణంఆద్యంతపుణ్యకాలంగం 01 : 17 ని//లు

1 గంట 17 నిమిషాలుగ్రహణసమయం.

ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మరియు మేషరాశి నందు సంభవించుచున్నది కావున అశ్విని నక్షత్ర జాతకులు మరియు మేషరాశి వారు గ్రహణం చూడరాదు, అలాగే గ్రహణ అనంతరం తరువాత రోజు ఉదయం యధావిధిగా గ్రహణశాంతి చేసుకొనవలెను.

మరుసటి రోజు 29.10.2023 ఆదివారం గ్రహణ శూల కావున దూర ప్రయాణములు చేయరాదు.

ఈగ్రహణముఅశ్వినీనక్షత్రం, మేషరాశిలోఏర్పడుతుంది.

  • అశ్వనీభరణీ, కృత్తికా 1వపాదంమేషరాశివారుచూడరాదు. కుంభం, వృశ్చికం, కర్కాటకం, మిథునంరాశులవారికిశుభఫలం.
  • తుల, ధనస్సు, సింహం, మీనరాశులవారికిమధ్యమం.
  • మేషం, వృషభం, కన్య, మకరంరాశులవారికిఅధమఫలం.

గ్రహణశాంతి: గ్రహణదోషమున్నవారు,

  • మేషం, వృషభం, కన్య, మకరం రాశుల వారు గ్రహణ శాంతి చేసుకోవాలి.
  • 29-10-2023 ఆదివారం ఉదయం మినుములు1/4 కేజి, బియ్యం 1.1/4 కేజీ, వెండినాగపడగను, వెండిచంద్రబింబమును, పాలు, తెల్లనివస్త్రం, దక్షిణ,ఆవు నేతితో నింపిన రాగి పాత్రతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చి గ్రహణ పరిహారం చేసుకోగలరని శాస్త్రవచనము.

ఈవిధంగాచేయలేనివారుమహాన్యాసపూర్వకఏకాదశరుద్రాభిషేకంచేయించినగ్రహణశాంతికలుగగలదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News