Thursday, January 23, 2025

నగర యువత సంఘ సేవాలో పాల్గొనాలి: అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Participate in city youth community service: Additional Collector

హైదరాబాద్: యువత చెడు మార్గాలలో నడవకుండా సన్మామార్గంలో నడవాలని, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు సూచించారు. గురువారం నెహ్రూ యువ కేంద్ర ఆద్వర్యంలో జిల్లా యువ సమ్మేళనం యూత్ హాస్టల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ బస్తీలో యువజన సంఘాలు, యువతీ మండలిలు ఏర్పాటు చేసి సంఘసేవలో పాల్గొనాలి కోరారు.అనంతరం జిల్లా యువజన సంఘం అవార్డు 202122 పరియావరణ పరిరక్షణ సేవ సమితి జియాగూడ అధ్యక్షులు నరేష్‌కు మెంబెర్స్ అందజేశారు. ఈకార్యక్రమంలో డా. అలోక్‌గుప్త, రీజినల్ డైరెక్టర్ ఓపెన్ స్కూలింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుచిత్ర కార్పొరేటర్ రాంగోపాల్‌పేట, డా. యం, అక్కేశ్వర్‌రావు, సుధాకర్‌రావు, కుమారి ఖుష్బూ గుప్త తదితరులు పాల్గొన్నారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News