Monday, December 23, 2024

హరితహారంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి: టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సూచనల మేరకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణకు హరితహారంలో ప్రతి ఒక్కరూ మరింత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి గౌరవరం రఘుమారెడ్డి ఉద్యోగులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ హరితోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిఎండి గౌరవరం రఘుమారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భముగా సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో వృక్షాలు, వనాలతో పచ్చదనంగా మారిందని కొనియాడారు. ముఖ్య మంత్రి కే చంద్ర శేఖర్ రావు చేపట్టిన ఈ హరిత హారం కార్యక్రమం సాధారణ ప్రజల్లో సైతం పచ్చదనం గురించి చైతన్యం తెచ్చిందన్నారు. సకల జీవకోటికి చెట్లు ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ పచ్చని మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పల కాపాడాలన్నారు. పచ్చని చెట్లతో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా తెలంగాణ రాష్ట్రం లో పచ్చదనం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ నేడు హరితహారంలో మొక్కలను నాటుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా సోమవారం రోజు హరితోత్సవం సందర్భముగా సంస్థ పరిధిలోని అన్ని జోనల్, సర్కిల్, డివిజన్ వంటి అన్ని కార్యాలయాల్లో తమ శాఖ తరఫున మొక్కలు నాటారని తెలిపారు.

హరితహారంలో భాగస్వామ్యం అయిన ఎస్‌పిడిసిఎల్ ఉద్యోగులకు, అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. హరితహారం ద్వారా నాటిన మొక్కలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రంగా నిర్మించడమే మన ధ్యేయం అని అన్నారు. మనం మొక్కలు నాటడమే కాకుండా ముఖ్యంగా మన పిల్లలతో మన ఇంటి ఆవరణలో కూడా మొక్కలను నాటించి సంరక్షించడం ఒక అలవాటుగా నేర్పించాలని అన్నారు. మొక్కలను, చెట్లను కాపాడితే మనల్ని కాకుండా మన భావితరాలను కూడా కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డితో పాటు డైరెక్టర్ లు టి శ్రీనివాస్, కే రాములు, సిహెచ్ మదన్ మోహన్ రావు, పి నరసింహ రావు, ఎస్ స్వామి రెడ్డి, జి గోపాల్, సివిఓ కే మురళీధర్ రావు , చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

భావితరాలకు కాలుష్యరహిత భవిష్యత్తును అందించాలి : ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు
మొక్కలు నాటి భావితరాలకు కాలుష్యరహిత భవిష్యత్తును అందించాల్సిన గురుతరమైన భాద్యత మనందరిపై ఉందని టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ భాద్యత కూడా చేపట్టాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్వాములవ్వాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్ ఎస్‌పిడిసిఎల్ )కార్పోరేట్ కార్యాలయం విద్యుత్ భవన్ లో సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు సంస్థ డైరెక్టర్లతో కలిసి వివిధ పూల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా సిఎండి అన్నమనేని గోపాల్రావు మాట్లాడుతూ రోజు రోజుకు వాతవరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రించడానికి హరిత వనాలు అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(హెచ్గార్డి, పి&ఎంఎం) శ్రీ బి.వెంకటేశ్వర రావు, డైరెక్టర్ (ఐపిసి& ఆర్‌ఎసి) శ్రీ పి.గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) శ్రీమతి పి.సంధ్యారాణి, డైరెక్టర్ (ఆపరేషన్, ప్రాజెకట్స్) శ్రీ పి.మోహన్రెడ్డి, ఇంచార్జ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ వి.తిరుపతి రెడ్డి గార్లు, ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి.జనార్ధన్ గారు, సి.జి.యంలు అశోక్ కుమార్, సదర్ లాల్, మోహన్ రావు, కిషన్, ప్రభాకర్, రాజుచౌహాన్, కె.ఎన్.గుట్ట, రవీంధ్రనాథ్, బీకంసింగ్ గార్లు జి.యంలు, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం గారు, ఎస్‌ఈ సివిల్ అంకుస్ గారు తదితరులు పాల్గొన్నారు.

SPDCL

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News