Monday, November 25, 2024

ఢిల్లీలో ఎపి భవన్ విభజన పూర్తి

- Advertisement -
- Advertisement -

ఇరు రాష్ట్రాల అంగీకారం
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : ఢిల్లీలోని ఎపి భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఎపి భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. ఎపి భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎపి ప్రభుత్వం అంగీకారం తెలుపడంతో సమస్య పరిష్కారం అయ్యింది. దీంతో ఎపి భవన్‌ను విభజిస్తూ శనివారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎపి అంగీకారం తెలిపింది.

ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింధియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఎపి వాటాగా 11.536 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245ఎకరాలు కేటాయించారు. ఎపికి 5.781ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎపికి నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News