Wednesday, January 22, 2025

పార్టీ ఎజెండా శిరోధార్యం

- Advertisement -
- Advertisement -

ములుగు ః ప్రతి కార్యకర్తకు బిఆర్‌ఎస్ పార్టీ ఎజెండా శిరోధార్యమని ములుగు జడ్పి చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయానికి విచ్చేసిన మలుగు జడ్పి చైర్మన్‌కు బిఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పి చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఎవరికి స్వీయ ఎజెండా లేదని, తామంతా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తు పార్టీ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. మూడవ సారి సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రి కాయమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండలాధ్యక్షుడు గాడదాసు సునీల్‌కుమార్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, ఎంపిపి విజయ, జడ్పి కోఆప్షన్ వలియాబి సలీం, తుమ్మ మల్లారెడ్డి, కావేరి చిన్ని కృష్ణ, జిల్లా మైనారిటీ సెల్ ఖాజా పాషా, ఏటూరునాగారం సర్పంచ్ రాంమూర్తి, గారె ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News