Friday, January 10, 2025

పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుంది : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కష్టపడి పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజు ఒక ఉదాహరణ అని అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే ప్రాతిపదకనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాలుగు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఎఐసిసి కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందిస్తూ కొత్తగా నియమితులైన కార్యదర్శులను స్వాగతం పలుకుతూ తీర్మానాలు చేశారు.

బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని మరో తీర్మానం చేశారు. సిఎల్‌పి నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా వారిని అభినందిస్తూ సభ తీర్మానించిందన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇంఛార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 15 రోజులకు ఒక నివేదిక పంపాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలని, పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయని అన్నారు. సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News