Monday, January 20, 2025

ఘనంగా పర్వతగిరి పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

 

మహా కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు భారీ ఎత్తున తరలిరావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతులను, సంప్రదాయాలను పునరుద్ధరించి, భావి తరాలకు అందించాలనే గొప్ప ఆశయంతో కాకతీయుల కళావైభవంగా విలసిల్లిన ఉమ్మడి వరంగల్ పరిధిలోని పర్వతగిరి పర్వతాల గుట్ట శివాలయంలో ఉన్న దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పర్వతాల శివాలయాన్ని 2023 జనవరి 26 తేదీన ఘనంగా పునః ప్రతిష్టాపన చేయనున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈరోజు పర్వతాల శివాలయంలో జరుగుతున్న పనులు, భక్తుల కల్పించే వసతులు, మూడు రోజులపాటు జరిగే మహాశివుని మహా కుంభాభిషేకం ఉత్సవ కార్యక్రమాలను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ వాస్తు నిపుణులు నూకల నరేష్ రెడ్డి గారితో కలిసి మంత్రి పర్యవేక్షించారు.

మూడు రోజులపాటు జరిగే మహా కుంభాభిషేకం పవిత్ర కార్యక్రమంలో జనగాం, వరంగల్, హనుమకొండ జిల్లాలు పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలు భారీ ఎత్తున రానున్న నేపథ్యంలో వసతులలో ఎలాంటి లోపం లేకుండా చూడాలన్నారు.భక్తులు కూడా ఇంటి దగ్గర నుంచి శివునికి అభిషేకం చేసే విధంగా పూజ సామాగ్రితో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News