Monday, December 23, 2024

ఫిట్స్ రావడంతో సైకిల్ పైనుంచి చెరువులో పడి విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తొమ్మిదో తరగతి విద్యార్థిని సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ వ్యాధి రావడంతో చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వీతీపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆవాలవలసగ్రామంలో సత్యం-పార్వతి దంపతులకు శ్రావణి అనే కూతురు ఉంది. గాదెలవలస జడ్‌పి ఉన్నత పాఠశాలలో శ్రావణి అనే విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. శ్రావణి సైకిల్‌పై తన ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్తుండగా ఫిట్స్ వచ్చింది. దీంతో సైకిల్ పైనుంచి చెరువులో పడిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు విద్యార్థిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. అటు కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: తాజ్‌మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కర్రలు, రాడ్లతో దాడి..(వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News