Monday, December 23, 2024

అమితాబ్ బచ్చన్ పై అన్యాయంగా నిందలేసిన పర్వీన్ బాబీ

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి పర్వీన్ బాబీ, నటుడు అమితాబ్ బచ్చన్ కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించారు. వారు నటించిన మజ్బూర్, దీవార్, కాలియా, అమర్ అక్బర్ ఆంథోని, కాలా పత్తర్, షాన్ వంటి ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే వారి మధ్య ఏదో సంబంధం ఉందంటూ పుకార్లు  కూడా షికారు చేశాయి. అయితే అప్పటికే అమితాబ్ బచ్చన్, నటి జయా బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. పుకార్ల కారణంగా అమితాబ్ బచ్చన్ , పర్వీన్ బాబీని దూరం పెట్టాడు.

ఇదిలావుండగా పర్వీన్ బాబీ తనని అమితాబ్ కిడ్నాప్ చేశాడని, తనను హతమార్చడానికి ప్రయత్నిస్తున్నాడని నిందించింది. అంతేకాక ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అమితాబ్ అంతర్జాతీయ గ్యాంగ్ స్టర్ అని, నన్ను అంతమొందించాలని చూస్తున్నాడు. అతడి గూండాలు నన్ను కిడ్నాప్ చేసి ఓ దీవిలో ఉంచి నాపై సర్జరీ చేశారు. నా కుడి చెవి కింద ట్రాన్స్ మీటర్ చిప్ పెట్టారు’ అని చెప్పింది. ఆ తర్వాత పోలీసు ఫిర్యాదు కూడా చేసింది. కానీ ఆమెకు మనో వైకల్యం(షిజోఫ్రేనియా) తో బాధపడుతోందని తేలింది. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా ఆలోచించడం, ప్రవర్తించడం వంటి వాటిని ప్రభావితం చేస్తోందని తేలింది.

దీనిపై అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ‘ఆమెకు మనుషులంటే భయం పట్టుకుంది. అనేక మతి భ్రమణలకు గురవుతోంది’ అన్నారు. పర్వీన్ బాబీ 70-80 దశకం మధ్యలో బాగా ఆదరణ పొందిన నటి. ఆమెకు ‘పారనాయిడ్  షిజోఫ్రేనియా’ ఉందని ఆరోగ్య పరీక్షలో తేలింది. ఆమె తన 50వ ఏట అనేక అంగాలు పనిచేయకపోవడం వల్ల చనిపోయింది. ఆమె చనిపోయిన విషయం కూడా మూడు రోజుల వరకు వెలుగు చూడలేదు. ఆమె చివరి అంత్యక్రియలు పూర్తి కావడానికి మహేశ్ భట్ సాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News