Monday, January 20, 2025

కీలక బిల్లులకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు గురువారం నిరవధికంగా వాయిదా పడింది. షె డ్యూల్ ఒకరోజు ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం లోక్‌సభ ప్రె స్ అండ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం స్పీ కర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. బ్రిటీష్ కాలం నా టి ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ చట్టా ల స్థానంలో తీసుకువచ్చిన కొత్త బి ల్లులకు ఆమోదం తెలిపింది. అంతకుముందు టెలికాం బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

ఆ తర్వాత రా జ్యసభ సైతం నిరవధికంగా వాయి దా పడింది. ఈ నెల 13న పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన వెలు గు చూసిన విషయం తెలిసిందే.ఆ త ర్వాత ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఆం దోళన చేశాయి. భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోం అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు  ఉభయ సభల్లో నిరసనలు తెలిపాయి.ఈ క్రమంలో లోక్‌సభతో పాటుగా రాజ్యసభలో కలిపి మొత్తం 143 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటు చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు సస్పెండ్ కావ డంఇదే మొదటిసారి. ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పలు కీల క బిల్లులను ఆమోదించింది. కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు, జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు, చీఫ్ ఎలక్షన్‌కమిషనర్, కమిషనర్ల నియామకం బి ల్లు తదితర బిల్లులకు లోక్‌సభ ఆమోదం తె లిపింది.టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో దోషి గా ని ర్ధారిస్తూ పార్లమెంటు ఎథిక్స్ కమి టీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభ లో ఆమోదించిన తర్వాత మహువా ను లోక్‌సభ బహిష్కరించింది. ముందు నిర్ణయించిన ప్రకారం పార్లమెంటు ఈ నెల 22 వర కు జరగాల్సి ఉంది. ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు.
టెలికాం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
పార్లమెంటు మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా ప్రభుత్వం తాత్కాలికంగా టెలికాం సర్వీసలను తన అధీనంలోకి తీసుకోవడాని కి, అలాగే వేలం లేకుండా శాటిలైట్ స్పెక్ట్రం ను కేటాయించడానికి వీలు కల్పించే టెలీ కమ్యూనికేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించిం ది. లోక్‌సభ బుధవారం ఈ బిల్లును స్వల్ప చర్చ అనంతరం ఆమోదించిన విషయం తెలిసిందే.జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా టెలికాం సేవలను తాత్కాలికంగా తన అధీనంలోకి తీసుకోవడానికి, అలాగే శాటిలైట్ స్పెక్ట్రం కేటాయింపునకు వేలం లేని విధానాన్ని కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు.అంతేకాకుండా ప్రజా ఆత్యయిక స్థితి ఎదురయినప్పుడు లేదా ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌ను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి రెండు చట్టాల స్థానంలో నవభారత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బిల్లును తీసుకువచ్చినట్లు బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
వార్తా పత్రికలు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ, బ్రిటీష్ కాలం నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఈ బిల్లుకు గత ఆగస్టు 3 ఆమోదం తెలిపింది. కాగా గురువారం బి ల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమో దం తెలిపింది.1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం స్థానంలోఈ బిల్లును తీసుకువచ్చారు. పాత చట్టం కింద వార్తాపత్రికలు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎనిమిది అంచెలను దాటాల్సి ఉం డేదని, ఇప్పుడు ఈ కొత్త బిల్లు వల్ల ఇది సులభతరం కావడమే కాకుండా ఒక బటన్‌ను నొక్కడంతో పూర్తవుతుందని బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News