Monday, December 23, 2024

గగనతలంలో విమానం తలుపు తెరిచే యత్నం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఆల్బుక్వెర్క్ నుంచి షికాగో వెళుతునన అమెరికన్ ఎయిర్‌లైన్స్ 1219 విమానంలో ఒక నాటకీయ ఘటన చోటు చేసుకుంది. ఆల్బుక్వెర్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సుమారు 30 నిమిషాల తరువాత ఒక వ్యక్తి అత్యవసర నిష్క్రమణ తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతో ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వారు ఎంటనే కార్యోన్ముఖులై ఆ వ్యక్తిని సీటుకు కట్టివేశారు. డైలీ మెయిల్ సమాచారం ప్రకారం, ఐదుగురు ప్రయాణికులు ఆ దుండగీడును విమానం అడుగు భాగానికి నొక్కిపెట్టారు. అతని నుంచి వేరే ముప్పు ఎదురుకాకుండా చూడడానికి వారు అతనిని నిర్బంధించడానికి డక్ట్ టేప్‌ను ఉపయోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News