Thursday, January 23, 2025

విమానంలో హైజాక్ అన్నందుకు ప్రయాణికుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తుండగా ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరు హైజాక్ అనే పదాన్ని విన్నారు. దీంతో వెంటనే భద్రతా అధికారులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ముంబైఢిల్లీ విస్తారా విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

భద్రతా సిబ్బంది విమానంలో సోదాలు నిర్వహించారు. అనుమతి లభించిన తర్వాతే విమానం టేకాఫ్ అయింది. నిందితుడిని రితేష్ సంజయ్‌కుకర్ జునేజాగా గుర్తించారు. అతను మానసిక వ్యాధిగ్రస్తుడని పేర్కొన్నాడు. అందుకే ఫోన్ సంభాషణలో హైజాక్ అనే పదాన్ని ప్రస్తావించాడు. ముంబైలోని సహర్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News