Sunday, December 22, 2024

గంటలు గడిస్తున్నా కదలని విమానం.. పైలట్ పై దాడి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఫ్లైట్ ఆలస్యంగా బయల్తేరనున్నట్లు అనౌన్స్ చేస్తున్న పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం ఇండిగో విమానం ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరాల్సి ఉండగా.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంతలోనే పైలట్ వచ్చి.. ఫ్లైట్ బయల్దేరడానికి మరింత సమయం పడుతుందని చెబుతుండగా.. సహనం కోల్పోయిన ఓ ప్రయాణికుడు.. కోపంతో పైలట్ పై దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News