Friday, December 27, 2024

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఆర్‌టిసి డిపో కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు కొరికిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఉట్నూరు సమీపంలో అజీంఖాన్ అనే వ్యక్తి ఎక్కాడు. ఆదిలాబాద్ వరకు టికెట్ తీసుకున్న తరువాత సీటు లేదని కండక్టర్‌తో గొడవకు దిగాడు. సీటు లేకపోవడంతో తనకు డబ్బులు ఇవ్వాలని గొడవ దిగాడు, డబ్బులు ఇచ్చేయడంతో దిగివెళ్లిపోయాడు. అజీంఖాన్ మరో వాహనంలో పిప్పల్ కోటి వరకు వచ్చిన తరువాత బస్సును ఆపి కండక్టర్‌తో మళ్లీ గొడవకు దిగాడు. కండక్టర్‌పై దాడి చేసి చెంపపై కొరికాడు. బాధిత కండక్టర్ ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News