- Advertisement -
లక్నో: ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఎయిర్‌ఇండియా విమానం (ఎఐ2845) చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే విమానం సీట్లు శుభ్రం చేస్తుండగా.. సిబ్బంది ఓ ప్రయాణికుడు చలనం లేకుండా ఉండటం గమనించారు. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి చూడగా.. అతనికి ఇచ్చిన ఆహారం అలాగే ఉండటం, కనీసం సీటు బెల్టు కూడా తీయకపోవడంతో విమానం ప్రయాణంలో ఉండగానే చనిపోయినట్లు భావించారు. మృతుడు ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గురించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబసభ్యులకు అధికారులు సమాచారం అందించారు.
- Advertisement -