Friday, January 3, 2025

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పెగడపల్లి మండలం బతకపల్లి గ్రామానికి చెందిన చుక్కల రాజయ్య పని నిమిత్తం కరీంనగర్ నుంది గంగాధరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో బస్సులో రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. వెంటనే బస్సు డ్రైవర్ 108 సిబ్బందికి సమాచారం అందించారు. కాగా అంబులెన్స్ వచ్చే సరికి రాజయ్య మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News