Wednesday, January 22, 2025

బిర్యానీ తీసుకరమ్మని చెప్పి…. ట్యాక్సీ కారును అపహరించిన ప్రయాణికుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో టాక్సీ కారును ప్రయాణికుడు అపహరించాడు. క్యాబ్ డ్రైవర్‌ను బిర్యానీ కోసం పంపి కారుతో ప్రయాణికులు పారిపోయాడు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ప్రయాణికుడు క్యాబ్ ఎక్కాడు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుగా ప్రయాణికుడు చెప్పుకున్నాడు. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద కారులో ఉండి బిర్యానీని ప్రయాణికుడు అడిగాడు. క్యాబ్ డ్రైవర్ బిర్యానీ తెచ్చేలోపు కారుతో సహా ప్రయాణికుడు ఉడాయించాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News