Wednesday, January 22, 2025

40 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌శ్రీలంక ఫెర్రీ సర్వీస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌శ్రీలంక మధ్య అంతర్జాతీయ హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ ప్రారంభమైంది. 40 ఏళ్ల క్రితం శ్రీలంకలో సివిల్ వార్ వల్ల ఆగిపోయిన ఈ సర్వీస్ ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించారు. తమిళనాడు తూర్పు తీరం లోని నాగపట్నం, శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ లోని కంకేసంతురై మధ్య ఈ సర్వీస్ శనివారం తిరిగి ప్రారంభం కావడాన్ని భారత్ శ్రీలంక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా భారత ప్రధాని నరేంద్రమోడీ , శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే వీడియో ద్వారా ప్రశంసించారు. రెండు దేశాల మధ్య రవాణా , వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు.

ఈ ఫెర్రీ సర్వీస్‌ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సిఐ) నిర్వహిస్తుంది. 150 మంది ప్రయాణికుల సామర్ధంతో నాగపట్నం, కంకేసంతురై మధ్య 60 నాటికల్ మైళ్లు (110 కిమీ) సాగే ఈ ఫెర్రీ దాదాపు 3.5 గంటల్లోనే గమ్యం చేరుకుంటుంది. చెరియపానిని అనే పేరు గల ఈ ఫెర్రీ ప్రారంభ సర్వీస్‌లో 50 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బంది భారత్ నుంచి శ్రీలంకకు శనివారం ఉదయం 8.15 గంటలకు బయలుదేరారు. మళ్లీ సాయంత్రానికే శ్రీలంక నుంచి తిరిగి వస్తుంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్వానంద సోనోవాల్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జెండా ఊపి ఈ సర్వీస్‌ను ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News