హవాయి: హవాయి విమానంలో గందరగోళంలో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం నాడు జరిగింది. ఆదివారం ఉదయం 278 మంది ప్రయాణికులతో హవాయి వెళుతున్న విమానం మార్గ మద్యలో హోనోలులుకి చేరుకునే సరికి ఉరుములతో కూడిన గాలివానాలు రావడంతో విమాన ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఉరుములతో కూడిని గాలివానలు చూసి విమానంలో ఉన్న ప్రయాణికులు భయపడ్డారు. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికుల మధ్య తొక్కొసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో సమారుగా 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఫీనిక్స్ నుండి హవాయి ఎయిర్‌లైన్స్ విమానంలో గాయాల గురించి ఉదయం 10 గంటల తర్వాత కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. సమాచారంతో స్పందించిన విమాన మార్గాన్ని మార్చి ఉదయం 10:50 గంటలకు హోనోలులులో సురక్షితంగా ల్యాండ్ చేయించారు. వెంటనే అధికారులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.