Monday, December 23, 2024

ఎయిర్ హోస్టెస్‌పై అనుచిత ప్రవర్తన: ప్రయాణికుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే స్పైస్ జెట్ విమానంలో ఒక ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్‌తో అమర్యాదకరంగా వ్యవహరించిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దింపివేసి వారిలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అబ్సర్ ఆలంగా గుర్తించారు. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎయిర్ హోస్టెస్‌తో ఒక వ్యక్తి వాదులాడుతుండగా మరో వ్యక్తి అతనికి మద్దతుగా నిలబడడం ఈ వీడియోలో కనిపించింది.

కొందరు ప్రయాణికులు కలుగచేసుకోవడానికి ప్రయత్నించడం కూడా కనిపించింది. విమానంలోని ఒక ప్రయాణికుడు ఈ వీడియోను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ సంఘటనపై స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో విమానం ఎక్కిన ప్రయాణికుడు తమ సిబ్బంది ఒకరిని వేధించడం, దుర్భాషలాడడం, ఆమె విధులకు ఆటంకం కల్పించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. తమ సిబ్బంది పైలట్ ఇన్ కమాండ్‌కు, భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఆ ప్రయాణికుడిని విమానం నుంచి దింపివేసి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News