Monday, January 20, 2025

నా విండో ఏది: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌పై ప్రయాణికుడి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కిటికీ పక్క సీటంటే చాలామందికి మక్కువ. బస్సు, రైలు, విమానం, వాహనం ఏదైనా విండో సీటు నుంచి ప్రకృతిని చూస్తూ పరవశించి పోయే ప్రయాణికులకు కొదవ లేదు. అయితే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అదనంగా డబ్బు చెల్లించి, ఏరి కోరి విండో సీటు బుక్ చేసుకున్న ఒక ప్రయాణికుడికి తీవ్ర నిరాశ ఎదురైంది. కిటికీ లేని కిటికీ పక్క సీటు రావడమే ఆ ప్రయాణికుడు చేసుకున్న దురదృష్టం. దీంతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనిరుధ్ మిట్టల్ అనే ప్రయాణికుడు ట్విటర్‌లో కిటికీ లేని విండో సీటు ఫోటోను షేర్ చేశాడు. హీత్రో ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యం విండో లోనుంచి చూస్తే అద్భుతంగా ఉంటుందని, అందుకే ఎక్స్‌ట్రా చెల్లించి ఏరికోరి విండో సీటు బుక్ చేసుకున్నానని అతను రాసుకొచ్చాడు. నా విండో ఎక్కడ అంటూ బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను మిట్టల్ నిలదీశాడు. ప్రస్తుతం ఈ పోస్టును 4.62 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్ల ఫన్నీ కామెంట్లతో ఈ ట్వీటుకు భారీ స్పందన లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News