Wednesday, December 25, 2024

బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన

- Advertisement -
- Advertisement -

వరంగల్: బస్సు ఆపకపోవడంతో వాహనానికి ముందు అడ్డంగా కూర్చొని ఓ మహిళ నిరసన తెలిపిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసి బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించింది. అనంతరం దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగింది. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో సదరు మహిళ ఆటో తీసుకొని బస్సు వద్దకు చేరుకుంది. అనంతరం బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News